by Suryaa Desk | Sun, Jan 12, 2025, 03:29 PM
స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. బీజేపి జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, తదితరులున్నారు.