by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:24 PM
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిటీ కళాశాల శాఖ ఆధ్వర్యంలో 162 స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొ.డా.ఏలూరు యాదయ్య అతిథిగా ప్రొ.శంకర్ నాయక్, ప్రొ.ఝాన్సీ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వివేకానందుడు భారతీయకు నిలువెత్తు నిదర్శనం అని,ప్రపంచ దేశాలకు భారత ఖ్యాతినీ విస్తరింపచేసిన మహాభావుడు అన్నారు.భారతీయ విలువలను, సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన కర్మయోగి అని,వివేకాకానందుని ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని,అదేవిధంగా వివేకానంద స్ఫూర్తి యువతకు,విద్యార్థులకు ఆదర్శం అన్నారు.ఈ దేశం భవిత యువతగా మన మీదనే ఆధారపడి ఉందన్నారు. ఈ దేశాన్ని విచ్చిన్నం చేయడానికి విదేశీ భావజాల శక్తులు పనిచేస్తున్నాయని, కులం పేరుతో,మతంపేరుతో, ప్రాంతాల పేరుతో విభజన రేఖలు గీయడానికి ప్రయత్నిస్తున్న శక్తులు కళాశాల క్యాంపస్ లను,యూనివర్సిటీలను వేదికగా చేసుకుంటున్నాయని వాటిని తరిమికొట్టే భాధ్యత ఈ దేశ పౌరులుగా మన మీద ఉండాలన్నారు.
ఆర్థికంగా,శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి వైపు మన దేశం దూసుకెళ్తున్న ఈ తరుణంలో యువత మంచి మానవనరులుగా తయారయ్యి దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలన్నారు. విశ్వ గురుగా భారత్ ఆవిర్భవించాలన్న, వికాసిత్ భారత్ గా భారత్ ఆవిర్భవించాలన్న ముందుగా యువత ఈ దేశ పట్ల ప్రేమ, భక్తి కలిగి ఉంటేనే సాధ్యమవుతుందని అన్నారు.మహనీయుల ఆశయాలను పునికి పుచ్చుకొని నిరంతరం దేశ సంరక్షణ కోసం మనందరం కూడా పనిచేయాలన్నారు .ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు జితేందర్, చార్మినార్ నగర కార్యదర్శి రవి, విద్యార్థి నాయకులు సందీప్,సంతోష్,శివ శంకర్, సాకేత్ కీర్తి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.