by Suryaa Desk | Sun, Jan 12, 2025, 03:20 PM
వికారాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీస్ అధికారులు తాండూరు పట్టణంలోని గాలిపటాలు అమ్మే దుకాణంపై దాడి చేసి షాపు యజమాని సచిన్ నుండి సుమారు రూ.6,400/- రూపాయల విలువ గల 32 ప్యాకెట్ల, ప్రభత్వ నిషేధిత చైనా మంజా ను స్వాధీనం చేసుకొని తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.అని టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలియజేయడం జరిగింది.
జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ నిషేధిత చైన మంజా లను వాడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.అని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలియజేయడం జరిగింది.