by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:53 PM
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుతో రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా పోలీసులు ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు. రద్దీని అవకాశంగా తీసుకుని దొంగతనాలకు పాల్పడే ఘటనలు జరగవచ్చని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రైల్వే స్టేషన్లు, బోగీల్లో చోరీలకు అంతర్రాష్ట్ర ముఠాలు చురుకుగా యత్నిస్తున్నట్లు గుర్తించామని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.