by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:30 PM
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలో వెలిసిన శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి వారి ఆలయానికి పూరతమైన చారిత్రాత్మక నేపథ్యంలో ప్రతీ ఏడాది సంక్రాంతి పండగ ప్రారంభం ముందు నుండి మూడు రోజుల పాటు ఆలయ కవిటీ ప్రతినిధులు గ్రామస్తులు, భక్తుల సహకారంతో జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాలలో హాజరైన భక్తులు వీరభద్ర స్వామిని దర్శించుకొని అగ్నిగుండాలు తొక్కిన భక్తులకు అనుగ్రహం ఉంటుందని ప్రతీది మహిమాన్వితమైన శక్తి కలిగిన వీరభద్ర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడినుండో భక్తులు వస్తుంటారు. అభిషేకం అర్చన వివిధరూపాలతో కొలిచిన స్మరించుకున్న కోరికలు నెరవేరుతాయి అని ఇక్కడి ప్రజల నమ్మకం.
ఆలయ చరిత్ర...
శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి దేవాలయం సుమారు 200 వందల సంవత్సరాల క్రితం నాటిదని గ్రామంలోని పెద్దమనుషులు తెలిసినవారికి ఇక్కడ వీరభద్ర స్వామి వారి దేవాలయం గురించి స్వామివారి మహిమల గురించి చెబుతుంటారు.
ఘనంగా ఏర్పాట్లు...
జాతర ఉత్సవాలు ప్రారంభం అయ్యే కంటే ముందుగానే గ్రామస్తులంతా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఎవరి భాధ్యతల్లో వారు తలమునకలై పనులు చేస్తూ ఉంటారు. ప్రతీ ఏటా జరిగే జాతర ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌక్యూర్థం ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాట్ల కార్యక్రమాలను పర్యవేక్షణ చేస్తుంది.. స్వామి వారి కళ్యాణ ఘట్టం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూజరుల బృందం ఏర్పాట్లు చేశారు.
జాతర ఉత్సవాల కార్యక్రమాలు...
తేదీ 12 న ఉదయం 5:30 కు దిష్టి కుంభ బలిహరణ, 8:00 కు రుద్రాభిషేకం, 10:00 గణపలి సహిత రుద్రహోమం, రాత్రి 7 గంటలకు భద్రకాళి అభిషేకం అలంకరణ కార్యక్రమాలు ఉంటాయి, తేదీ13 న ఉదయం 10:46 గం.లకు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కల్యాణమహోత్సవం, 1:00 సుంకుపట్టుట, మధ్యాహ్నం 1:30 కు అన్నదానం, 3:00 కు భద్రకాళి పూజలు, 4:00 వాహన పూజలు, బండ్లు తిరుగుట, సాయింత్రం 7:00 కు వీరభద్ర స్వామి ఊరేగింపు, రాత్రి 9:00 కు భజన కార్యక్రమం, తేదీ 14 న ఉదయం 4 గంటలకు అగ్నిగుండాలు తొక్కుట, 9 గంటలకు వీరభద్రుని గెలుపు పూజలు ఉంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే ఉత్సవాలలో వీరభద్రున్ని దర్శించుకుని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని దేవస్థాన అభివృద్ధి కమిటీ కోరుతుంది.