by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:36 PM
మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామంలో కొండస్వామి దేవస్థానం ఆవరణలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంపి నిధులు 5 లక్షల రూపాయలతో నిర్మించిన ఓపెన్ జిమ్ ని కోరుట్ల నియోజకవర్గ శాసనసభ సభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ శనివారం ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యం వ్యాయామం అలవాటు చేసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామంలో మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి , ఫ్యాక్టరీ చిట్టాపూర్ పాక్స్ చైర్మన్ నేరళ్ల మోహన్ రెడ్డి , కొండస్వామి దేవస్థానం కమిటీ సభ్యులు మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బండి ప్రశాంత్ , నక్క శివ , పాలెపు రాజేష్ , అల్వాల నర్సయ్య. గ్రామ నాయకులు పుల్ల జగన్ , ముదాం నర్సింమ్లు , డాకురి వెంకటేష్ , రంగు మహేష్ , బద్ద రాజేష్ , అంజయ్య , రమేష్ , రాజారెడ్డి, తిరుపతి , రాజెందర్ తదితరులు పాల్గొన్నారు.