by Suryaa Desk | Sun, Jan 12, 2025, 03:28 PM
కాగజ్‌నగర్ మండలం ఈస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని నజురుల్ నగర్ విలేజ్ నెంబర్ 5 గ్రామ శివారులో గుడుంబా తయారు చేస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు ఉదయం గుడుంబా స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో తుంగమడుగు గ్రామానికి చెందిన మహేష్(30) తండ్రి సుధాకర్, కులం: యాదవ, వృత్తి కూలీ, అను వ్యక్తి విలేజ్ నెంబర్ 5 గ్రామానికి శివారులో గుడుంబా తయారు చేస్తూ పట్టుబడ్డాడు. ఈ దాడిలో 150 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామన్నారు.
అలాగే 5 లీటర్ల గుడుంబాను స్వాధీన పరుచుకుని అతనిపై తెలంగాణ ప్రొహిబీషన్ ఆక్ట్ సి.ఆర్ నెంబర్ 07/24యు /ఎస్ 7(ఎ )ర్ /డబ్లు 8(ఈ ) ప్రకారం కేసు చేసినట్లు ఎస్ఐ మహేందర్ వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గుడుంబా తయారుచేసిన విక్రయించిన అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఈ దాడులలో ఎస్సై మహేందర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.