by Suryaa Desk | Sun, Jan 12, 2025, 04:05 PM
సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ ఉన్నాయి. అందుకే మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత )సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గాంధీల కుటుంబాన్ని చూసి మైనారిటీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారు . కానీ, ఇప్పుడు మైనారిటీల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ వమ్ము చేస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మతకల్లోలాలు జరిగాయని ఆరోపించారు. మతకల్లోలాలను నిరోధించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని? ప్రశ్నించారు. గంగా జమునా తెహజీజ్లా ఉన్న తెలంగాణలో చిచ్చుపెడుతున్నారు. మైనారిటీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని మండిపడ్డారు. మైనారిటీ డిక్లరేషన్ అమలు ఏమైంది? మైనారిటీ డిక్లరేషన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.మైనారిటీలకు కేటాయించిన బడ్జెట్లో కనీసం 25 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు. రూ.3000 వేల కోట్లు కేటాయించి కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాదీ ముబారక్ కింద రూ.1.6 లక్షలతో పాటు తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టారని విమర్శించారు. నిజామాబాద్లో తబ్లిఖీ జమాత్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేయాలి. బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు.