by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:52 PM
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రజక రిజర్వేషన్ పోరాట సమితి (ఆర్ఆర్ పిస్)రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గేతో పాటు బీసి నాయకులు బత్తుల సిద్దేశ్వర్ జక్కని సంజయ్ లు చేసిన ఆమరణ దీక్ష ఫలితంగానే తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చి కులగణనను జరిపిందని దళిత బహుజన ఫ్రంట్ (డిబీఎఫ్) జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ తెలిపారు.శనివారం మండలంలోని నాగయ్య పల్లిలో కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం 17 రోజులపాటు ఆమరణ దీక్ష చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడిన చాపర్తి కుమార్ గాడ్గేను డిబీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
అనంతరం మాదాసి సురేష్ మాట్లాడుతూ బహుజన వర్గాల కోసం అలు పెరగకుండా నిరంతరం పోరాడుతున్న సిసలైన ఉద్యమకారుడు చాపర్తి కుమార్ గాడ్గే అని కొనియాడుతూ ఆయన నాయకత్వంలోనే రాజ్యాధికారం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చాపర్తి కుమార్ గాడ్గే మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం సాధించడానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమని, కేవలం కులగణనను మాత్రమే చేసి చేతులు దులుపుకోకుండా స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జనవరి 19న "రచ్చబండ కాడ రచ్చ చేద్దాం-రాజ్యాధికారాన్ని సాధిద్దాం" అనే నినాదంతో జనగామ జిల్లా ఖిలాషాపూర్ నుండి సైకిల్ యాత్రను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దళిత.