by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:48 PM
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ ప్రగతి నగర్ లో ఆదివారం స్వామి వివేకానందుని 163వ జయంతి సందర్భంగా BJP యువ మోర్చా అధ్యక్షులు అనిరుద్ర యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కన్వీనర్ డా. మల్లా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నివాళులు అర్పించి ప్రసంగిస్తూ ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అన్నారు.