by Suryaa Desk | Sun, Jan 12, 2025, 03:51 PM
పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం మల్లన్న జాతరలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే, కార్పొరేటర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.