by Suryaa Desk | Sun, Jan 12, 2025, 04:29 PM
విద్యార్థులకు క్రీడలు ఆత్మస్థైర్యాన్ని నింపుతాయని, క్రీడల వల్ల విద్యార్థులలో స్నేహభావం పెరుగుతుందని ఆదివారం ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు.
చండూరు మండల కేంద్రంలోని గాంధీజీ హైస్కూల్లో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీని నిర్వహించారు.