by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:27 PM
మాదిగ మాదిగ ఉపకులాల జేఏసీ జగదేపూర్ మండల కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. లక్ష డబ్బులు వెయ్యి గొంతుల సభను విజయవంతం చేయడంలో భాగంగా జగదేవపూర్ మండలంలోని 18 గ్రామాలలో ఉన్న మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు వార్డ్ సభ్యులు, ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్ సంఘాల నాయకులు పాల్గొని ప్రతి గ్రామం నుండి ఫిబ్రవరి 7న జరగబోయే లక్ష డబ్బులు వెయ్యి గొంతులు జాతరను విజయవంతం చేయాలని కమిటీ పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలో శనివారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మండల జేఏసీ అధ్యక్షునిగా మాసపాక యాదగిరి, ఉపాధ్యక్షులు పోసానిపల్లి రాజు, కర్రే యాదగిరి ,జంగాని ఐలయ్య, మరాటి కృష్ణమూర్తి, కొలిపాక రాములు, మర్కు కుమార్, మచ్చ గణేష్, కురాడపు బాబు, ప్రధాన కార్యదర్శిగా గడ్డం వెంకటేశం ,అధికార ప్రతినిధిగా జంగని బాలకృష్ణ ,సహాయ కార్యదర్శులుగా పోసంపల్లి రమేష్, గుండ్రు ఉప్పలయ్య, పైసా స్వామి, మాసపాక కనకయ్య, అబ్బి నరసింహులు, యాదగిరి, కర్రే పద్మారావు, ముక్కెర ఇస్తారి, మొక్కేర అశోక్, గడ్డమీది మల్లేష్, మన్నే హేమంత్ కుమార్, లింగాల కరుణాకర్, సురేష్ లతో పాటు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు...