by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:55 PM
చేనేత కార్మికుల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల భద్రత, నేతన్న భరోసా, అభయ హస్తం వంటి పథకాలను ప్రవేశపెట్టబోతుందని జోగిపేట చేనేత సహకార సంఘం చైర్మన్ వర్కల అశోక్ అన్నారు. శనివారం జోగిపేటలోని చేనేత సహకార సంఘంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2025వ సంవత్సరంలోనే ప్రవేశపెట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి మంత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన పథకాల మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని వారికి తెలియజేశారు. నేతన్న చేయూత పథకంనకు రెండు సంవత్సరాలు తగ్గించనున్నారని, నేతన్న భీమా, నేతన్న భరోసా పథకాల్లో వ్యూవర్స్‌కు రూ.18వేలు, వర్కర్లకు రూ.6వేల చొప్పున చెల్లిస్తారని సీఎం ప్రకటించినట్లు తెలిపారు. సీఎం ప్రకటించినట్లు తెలిపారు. క్యాష్ క్రెడిట్‌ను రద్దు చేయాలని రాష్ట్రంలోని చేనేత సంఘాలన్నీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. సొసైటీలోని మరమగ్గాలు పనికి రాకుండా పోయాయన్నారు. జోగిపేట సంఘానికి యారాన్లు, మరమగ్గాలు మంజూరు చేయాలని మంత్రి దామోదర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సంఘ నాయకులు యాదగిరి దుర్గారాం, పుల్గం శ్రీనివాస్, లక్ష్మి, మల్లమ్మ, సువర్ణ,నారాయణలు పాల్గొన్నారు.