by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:33 PM
హన్మకొండ-జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.రోడ్డుకు అడ్డంగా ఓ సీడ్ వ్యాపారికి చెందిన సీడ్ గోదాం,ఆఫీస్ భవనం అడ్డు రావడంతో అక్కడ హైవే రోడ్డు నిర్మాణం పనులు ఆగిపోయాయి.సీడ్ వ్యాపారికి చెందిన గోదాం,ఆఫీస్ అడ్డుగా ఉండటంతో రోడ్డు నిర్మాణం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామ శివారులోని కాకతీయ కాలువ సమీపంలో ఉన్న సీడ్ గోదాం వద్ద రెవెన్యూ అధికారులు 2018,2022 లో పలుమార్లు రోడ్డు విస్తరణ కోసం సర్వే నిర్వహించారు.సర్వే చేయగా రోడ్డు పక్కన ఉన్న సీడ్ గోదాం,ఆఫీస్ భవనాన్ని సీడ్ వ్యాపారి రోడ్డు విస్తరణలో కోల్పోతున్నాడు.రోడ్డు విస్తరణలో గోదాం,ఆఫీస్ భవనం కోల్పోతుండటంతో ప్రభుత్వం సీడ్ వ్యాపారికి నష్టపరిహారం చెల్లించింది.ఐతే రోడ్డు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ ఇటీవల గోదాం,ఆఫీస్ ను ప్రొక్లేయిన్ లతో కూల్చివేసే ప్రయత్నం చేయగా సీడ్ వ్యాపారి అడ్డుకున్నాడు.ప్రభుత్వం నుంచి పరిహారం పొందిన సీడ్ వ్యాపారి గోదాంతో పాటు ఆఫీస్ భవనం కూల్చనివ్వకుండా అడ్డుకున్నాడు.
కూల్చివేతను అడ్డుకోవడంతో అక్కడ హైవే రోడ్డు పనులు నిలిచిపోయాయి.ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన అనంతరం రోడ్డు పనులను అడ్డుకోవడంతో సీడ్ వ్యాపారిపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు పనులను అడ్డుకుంటున్న వ్యాపారికి ఓ అధికారి కొమ్ముకాస్తున్నట్లు ఆరోపణలున్నాయి.సీడ్ కంపెనీకి సమీపంలో ఉన్న కాకతీయ కాలువపై ప్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది.ప్లైఓవర్ నిర్మాణంతో సీడ్ కంపెనీ వద్ద రోడ్డు ఎత్తు పెరుగుతుంది.రోడ్డు హైట్ పెరగడంతో సీడ్ కంపెనీలోకి లారీల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని,రోడ్డు ఎత్తును తగ్గించాలని సీడ్ వ్యాపారి హైదరాబాద్ లెవల్ లో పైరవీ చేసి అధికారులపై,కాంట్రాక్టర్ పై ఒత్తిడి చేయించినట్లు సమాచారం.ఇప్పటికైనా సీడ్ గోదాం,ఆఫీస్ బిల్డింగ్ ను కూల్చివేసి రోడ్డు పనులు కొనసాగించి పూర్తి చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు.