by Suryaa Desk | Mon, Jan 13, 2025, 01:05 PM
నేరడుగొమ్ము మండలం పెద్దమునిగల్ లోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో వాలీబాల్ టోర్నమెంట్ ను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు లోకసాని కృష్ణయ్య ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతీయ యువ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క టోర్నమెంట్ ఏర్పాటు చేయడం సంతోష దాయకమని వివేకానందుని స్పూర్తితో ముందుకు పోవాలని క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని తెలిపారు.ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరు క్రీడా స్పూర్తితో ఆడాలని అన్నారు. మొదటి బహుమతి 5016, రెండవ బహుమతి 2516, మూడవ బహుమతి 1516.
మొదటి బహుమతి దాత కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు లోకసాని కృష్ణయ్య అని ఆర్గనైజర్స్ తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు లోకసాని కృష్ణయ్య,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నీలం ఆంజనేయులు యాదవ్, న్యూస్ టు డే యూ ట్యూబ్ ఛానెల్ హరీష్,సూర్య రిపోర్టర్ బెజవాడ శంకర్ గౌడ్,మాజీ ఎంపీటీసీ మురళీ కృష్ణ,మాజీ సర్పంచ్ పంబల అంజయ్య, పంబల పర్వతాలు,ఎల్లయ్య, వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ చంద్రశేఖర్ గౌడ్, సిద్దు,వీరేందర్,వాసుదేవ్, భాను,విజేయుడు,నాగరాజు,అనిల్ తదితరులు పాల్గొన్నారు.