by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:23 PM
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం గోదాదేవి రంగనాథ స్వామిల కల్యాణోత్సవం వైభవంగా సాగింది. బిఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సరోజ దంపతులు వధూవరులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రవీణ్ ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో గోదాదేవి రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహాలకు కల్యాణోత్సవం జరిపించారు. కళ్యాణ తంతు లో భాగంగా అర్చకులు పూలమాలలతో చేసిన నృత్యాలు భక్తులను అలరించాయి.
విద్యాసాగర్ దంపతులు సైతం పూలమాలలతో నృత్యం చేసి వాటిని వధూవరులకు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదాన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మహాజన్ నర్సింలు దంపతులు, కమిటీ సభ్యులు పాల్గొనగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించారు.