by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:25 PM
సంక్రాంతి ముందస్తు వేడుకలు అప్పుడే మొదలయ్యాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో సంబురంగా సాగుతున్నాయి. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి గ్రామర్ హైస్కూల్ లో ముందస్తుగా సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల ముగ్గులతో పాఠశాల ఆవరణాన్ని అలంకరించి, బోగి మంటలు వేశారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటల తయారీ, వ్యవసాయ పనులు బొమ్మల కొలువులతో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
స్కూల్ ప్రిన్సిపాల్ లు అరుణ్ మోనీ, స్నేహలత మాట్లాడుతూ.. మన పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతి వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఈ వేడుకలలో స్కూల్ స్టాప్ సెక్రటరీలు కునా బెహ్ర, సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.