by Suryaa Desk | Mon, Jan 13, 2025, 01:11 PM
సూరారం డివిజన్ సంజయ్ గాంధీనగర్ కు చెందిన శ్రీ వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గత పదేళ్ల కాలంలో సూరారం డివిజన్ ను కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పరచామని రానున్న రోజుల్లో కూడా కాలనీ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ బి.లక్ష్మీనారాయణ, జి.భద్రప్ప, కే.శ్రీనివాస్, ఎస్.వెంకటేష్ ప్రసాద్, నరసింహ చారి, నాగరాజు, అంజయ్య చారి, బక్కప్ప, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.