by Suryaa Desk | Mon, Jan 13, 2025, 01:02 PM
ఉమ్మడి మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఈజీఎస్ నిధుల నుండి 20 లక్షలు విడుదల కాగా ఈరోజు పనులను ప్రారంభించారు. అనంతరం గోవిందారం ప్రజలు ఈజీఎస్ నిధులు రావడానికి కృషి చేసిన ప్రభుత్వ వీప్ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, భీమారం మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తోకల నర్సయ్య, పుల్లూరి దేవయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు నల్లపు శేఖర్, బింగి స్వామి, ప్యాట వెంకటేష్, నరహరి, తిరుపతి, భూమయ్య, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.