by Suryaa Desk | Sun, Jan 12, 2025, 08:04 PM
నారాయణపేట జిల్లా ప్రజలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, రైతులు పాడి పంటలతో తులతూగి, ఆయా రంగాల్లో శ్రేయస్సు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ మన సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రతీకని ఈ పండుగ అందరిలో స్నేహభావం, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని అన్నారు. పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని అన్నారు.