by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:34 PM
అందోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎస్,సి 2002-2003 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం లక్మి దేవి గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందోలు పూర్వ ఉపాద్యాయులు పాల్గొనగా వారిని శాలువా, పూలదండలతో సన్మానించారు. ఈ సందర్బంగా పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లల్ని చక్కటి మార్గంలో విద్యావంతులను చేయాలని కోరారు. పిల్లలకు ముఖ్యంగా మొబైల్స్ ను దూరంగా ఉంచి చదువుపై ఆసక్తిని పెంచేలా ప్రోత్స హించాలన్నారు. తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులు తమ తమ పూర్వ ఆత్మీయత అనుభవాలను ఒకరికొకరు పంచుకున్నారు. పాత జ్ఞాపకాలను ఉపాధ్యాయుల ఎదుట నెమరు వేసుకొని గుర్తుచేసుకుని తరించారు.
సరస్వతి దేవి విగ్రహ ఏర్పాటు అందోల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సరస్వతి విగ్రహ ప్రతిష్ఠాపనకు విద్యార్థులంతా ఉపాద్యాయుల సమక్షంలో తొలి తీర్మానం చేశారు.దీనికి ఆరు నెలల్లో అందోలు స్కూల్ లో సరస్వతి విగ్రహ ఏర్పాటుకు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ చంద్ర శేఖర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు పాపయ్య మచ్చెందర్,లక్ష్మన్, హరికృష్ణ సూర్య ప్రకాష్ , కార్యక్రమ నిర్వాహకులు రవీందర్, శ్రీనివాస్, కృష్ణ ,సందీప్, నాగార్జున ,సందీప్ సత్యనారాయణలతో పాటు 2002-2003 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.