by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:38 PM
జిల్లాలో విస్తృతముగా మహిళా సభత్వ నమోదు జరుగుతుందని మహిళల హక్కుల సాధనకై ఐద్వా లో సభ్యులుగా చేరాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి పిలుపునిచ్చారు. ఈరోజు నల్గొండ మండలం చంద్దనపల్లి గ్రామంలో ఐద్వా సభ్యత్వం చేర్పించారు. ఈ సందర్బంగా ప్రభావతి మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళలు ముందుకు వెళ్తున్నప్పటికి రెండవ పౌరురాలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు ప్రాయం నుండి పండు ముసలి వరకు మహిళల్లపై గోరమైన అఘాత్యాలకి పాల్పడుతున్నారని అన్నారు.
ప్రభుత్వల పరిపాలన తీరు మారకుంటే మహిళల నిష్పత్తి పడిపోతుందని అన్నారు. ఇంకా దేశంలో అరాచకాలు పెరిగి పోతాయాన్నారు.మహిళలు ఐక్యమై పోరాటాలలోకి రావాలని కోరారు. జనవరి నుండి ఫిబ్రవరి చివరి వరకు ప్రతి గ్రామంలో సభత్వ నమోదు చేర్పించి కమిటీలు వేయనిన్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధ,జిల్లా కమిటీ సభ్యురాలు తంతేనపల్లి సైదమ్మా మాజీ ఎంపిటిసి సభ్యురాలు రూపాని వెంకటమ్మ గ్రామ మహిళలు పాలడుగు సైదమ్మా, రేణుక, అంజమ్మ, చింత సుగుణమ్మ, పాలడుగు సుప్రియ,సంధ్య తదితరులు పాల్గొన్నారు.