by Suryaa Desk | Mon, Jan 13, 2025, 01:17 PM
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో యూత్ ఐకాన్ స్వామి వివేకానంద జయంతి,పొట్టి కవితల కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి,వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి సంఘ సభ్యులు నివాళులర్పించారు.అనంతరం పద్మశాలి సంఘం అధ్యక్షులు చౌటపల్లి తిరుపతి మాట్లాడుతూ యువత స్వామి వివేకానందను స్ఫూరిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు.
సిటీ లైఫ్ పేరుతో ఆంధ్రజ్యోతిలో అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితల్లో ‘‘హైదరాబాదంతా పిండితే చిక్కని పాలు బంజారాహిల్స్’’ అని శ్రమదోపిడి రూపాన్ని బయటపెట్టాడు.ఈ కార్యక్రమంలో ప్రధాన,ఆర్థిక కార్యదర్శి అందే లక్ష్మణ్,అంకం లింబాద్రి,సహాయ కార్యదర్శి అంకం లక్ష్మీనారాయణ,సలహాదారులు గూడూరు రాజన్న,సామల వీరస్వామి,చౌటపల్లి తిరుపతి,గుండేటి సత్యనారాయణ,అంకం గోవర్ధన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.