by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:36 PM
బిజేపి బూత్ అధ్యక్షుడు మాదగోని నరేందర్ ఆద్వర్యం ఆదివారం సంక్రాంతి పండగ సందర్భంగా దోరేపల్లి గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి నకిరెకంటి మానస(50 గ్రా' ల వెండి పట్టీలు), రెండవ బహుమతి నర్సింగ్ దివ్య ప్రిస్టేజ్ మిక్సీ), మూడవ బహుమతి సముద్రాల వసుమతి(పట్టుచీర) , నాల్గవ బహుమతి చిన్నపాక మాధురి (రూపాయలు₹1016)లు. బిజేపి రాష్ట్ర మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత,నల్గొండ జిల్లా అధ్యక్షురాలు కాశమ్మ, పట్టణ అధ్యక్షురాలు తార, మండల మహిళా మోర్చ ప్రధాన కార్యదర్శి పాలకూరి సరిత గారి చేతుల మీదగా బహుమతులు అందజేశారు మహిళలు వారి నైపుణ్యాలను వెలికి తీయడంలో సంక్రాంతి ముగ్గులు మంచి గుర్తింపు తెచ్చిపెడతాయి చెప్పారు. మాదగోని నరేందర్ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు కృతజ్ఞతలు తేలుపుతూ వారికి శాలువాలతో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పులకరం భిక్షం, ప్రధాన కార్యదర్శి దాసరి వెంకన్న,ఉపాధ్యక్షులు మాదగోని ఏడుకొండలు, సైదులు, లింగయ్య,సిద్దు, నరసింహ, శ్రవణ్, భుజ్జయ్య, సుధాకర్,రవి, కిరణ్, అంజయ్య, స్వామి, రాజేష్, ఈశ్వర్ భిక్షం, దేవేందర్, పాలకూరి సైదులు, హరిబాబు ,దోరేపల్లి గ్రామ మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.