by Suryaa Desk | Mon, Jan 13, 2025, 01:09 PM
సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ సంక్రాంతి అని కేబి ఫౌండేషన్ చైర్మన్, పీఏసిఎస్ డైరెక్టర్ భూమయ్య పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆదివారం కేబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిగుల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు ముగ్గుల పోటీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ ప్రతిబింజేలా గంగిరెద్దుల ముగ్గులు, హరిదాసుల కథలు, చెరుకు గడలు, పాలపొంగులు, గాలిపటాలతో కూడిన అందమైన ముగ్గులు వేశారు. ప్రథమ స్థానంలో కల్పన, ద్వితీయ స్థానంలో మానస, తృతీయ స్థానంలో సుహాసిని ప్రతిభ చాటారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవ పండుగ సంక్రాంతి పండుగ అని వివరించారు. చేతికందిన పంటలు ఇంటికి చేరిన వేళ ..సిరి సంపాదాలతో కళ కళలాడే పండుగే మకర సంక్రాంతి అన్నారు. పిల్లల గాలిపటాలు, మహిళల రంగువల్లులు, పశువుల పండగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే యివకులకు సోమవారం క్రికెట్ టోర్నమెంట్, మంగళవారం కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, ఉపాద్యాయులు శంకర్, రమాదేవి, నాయకులు మల్లేశం, కిష్టయ్య, కరుణాకర్ రెడ్డి, ఆంజనేయులు, జర్నలిస్టులు పరశురామ్, నరేష్ యూత్ సభ్యులు అశోక్ ప్రకాష్ స్వామి క్రిష్ణ రెడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు...