by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:55 PM
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూనారం రోడ్డు లో స్వామి వివేకానంద 152 వ జయంతి వేడుకలు ఆకుల స్వామి ,కోమటిపల్లి రాజేందర్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ యువత మేల్కోండి మీ లక్ష్యాన్ని సాధించేవరకు ఆగకండి ,మీరు జీవించి ఉన్నంతకాలం నేర్చుకుంటూనే ఉండండి ,అనుభవమే ప్రపంచంలో మీకు ఉత్తమ గురువు, అని స్వామి వివేకానంద వ్యాఖ్యలను గుర్తు చేశారు.ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆకుల రమేష్, కేశవులు,బండి మహేందర్,దాసరి సతీష్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.