by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:41 PM
డివైఎఫ్ఐ , ఈతరం యూత్ నన్నూరి అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిప్పర్తి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా శాలిగౌరారం సిఐ కె కొండల్ రెడ్డి విచ్చేసి క్రీడలు ప్రారంభించారు వారు మాట్లాడుతూ నేడు యువత మద్యం మత్తుకి బానిసలు అవుతున్నారని తద్వారా వివక్ష కోల్పోతున్నారు అలాంటి తరుణంలో వారికున్న చెడు అలవాట్లు నుండి దూరం కావడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అలాంటి క్రీడల ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులు పోటీ తత్వాన్ని పెంచుకోవాలని గెలుపు ఓటమి సహజమని ఆటల్లో ఏ విధంగా అయితే గెలుపు ఓటములు ఉంటాయో అదేవిధంగా, మనిషి జీవితంలో కూడా గెలుపు ఓటములు సహజమని అవి అర్థం చేసుకున్న వాళ్లు జీవితంలో రాణించగలుగుతారని దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని నేడు మన దేశంలో అత్యధిక శాతం యువకులు ఉన్నారని వారు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని అన్నారు స్థానిక తిప్పర్తి ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ క్రీడలు అనేవి మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని బాడీలో ఉన్న వేస్ట్ మొత్తం చెమట రూపాన వెళ్ళిపోతుందని కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని నేడు ఎక్కువ మందిని వెంటాడుతున్న అతిపెద్ద ప్రమాదం గుండె సంబంధిత వ్యాధులని వాటి నుండి రక్షించడం కోసం క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని వారన్నారు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తిప్పర్తి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి క్రీడాకారులకు స్వాగతం పలుకుతూ అందరూ ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాలని వారన్నారు డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం.
అధికారంలోకి వచ్చేటప్పుడు యువతకు అనేక హామీలు ఇచ్చారు వాటిని నెరవేర్చడం ప్రభుత్వం విఫలమవుతుందని ఒలంపిక్ క్రీడల్లో పథకాలు తెచ్చే విషయంలో దేశం చాలా వెనకంజలో ఉందని క్రికెట్ ఒక్కటే కాదు అన్ని క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని యువత డ్రగ్స్ మద్యం గంజాయికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైనటువంటి ఆటలు ఆడి వీటి ద్వారా స్నేహబంధం పెరుగుతుందని డివైఎఫ్ఐ చేసే కార్యక్రమాలు యువత ఎదుర్కొంటున్న సమస్యల పైన నిరంతరం పోరాటాలు చేస్తుందని యువతని ఒక దాటమీద తీసుకొచ్చి వారిలో సమాజ శ్రేయస్ కోసం సమాజాభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ భీమ గాని గణేష్ ,డివైఎఫ్ఐ తిప్పర్తి మండల కార్యదర్శి పోకల శశిధర్, నిర్వహణ కమిటీ సభ్యులు జి ఏకలవ్య, ఎస్ లింగస్వామి ,జే నాగరాజు, ఎస్ రాజేష్, కోటేష్ ,నాగరాజు, నవీన్ ,మైనం సైదులు గణేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.