by Suryaa Desk | Mon, Jan 13, 2025, 01:00 PM
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ శివాజీ అందోలు శాఖ వారి ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి పండుగ, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో మొదటి బహుమతి బండల మాధురి, ద్వితీయ బహుమతి సాయి ప్రణవి, తృతీయ బహుమతి కే.మాలతిలు గెలుచుకున్నారు. వీరికి జిల్లా ఉమ్మడి జిల్లా విభాగ్ సహ సంపర్క్ ప్రముఖ్, ప్రముఖ న్యాయవాది ఆవడం అంబరీష్, నిర్వాహకులు బహుమతులను ప్రధానం చేశారు.
ఈ సందర్బంగా సంక్రాంతి పండగ ప్రాముఖ్యతను, స్వామి వివేకానంద జీవిత విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖ్‌లు అందోలు అవుసలి నరసింహులు, చౌటకూరు తీర్థాల సుబ్రహ్మణ్యం , బసవరాజు, ఆలయ పూజారి చిదిరే రాజశేఖర్ శర్మతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.