by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:53 PM
చేవెళ్ల మండల పరిధిలోని హస్తేపూర్ గ్రామంలో ఆదివారం గ్రామస్తులు మైసమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ మైసమ్మ జాతరలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సున్నపు వసంతం.
మర్పల్లి కృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, చేవెళ్ల, ముడిమ్యాల పీఎసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనే ప్రతాప్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, పడాల రాములు, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైసమ్మ జాతర కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను, కాంగ్రెస్ నాయకులను ఘనంగా సన్మానించారు.