by Suryaa Desk | Mon, Jan 13, 2025, 01:14 PM
కాలనీల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని శంబీపూర్ క్రిష్ణ అన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ 26వ వార్డు కేవిఆర్ వ్యాలీలో రూ.70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సి.సి.రోడ్డు నిర్మాణ పనులు, రూ.35 లక్షల వ్యయంతో నూతన సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసిన పురపాలక సంఘం చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీల అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తానన్నారు. మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తానని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. అనంతరం వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య, దూలపల్లి కౌన్సిలర్ కిరణ్, నాయకులు సంగొల్ల తిరుమలేష్, అక్కమొల్ల భిక్షపతి, శ్రీశైలం, మల్లేష్, వివిధ కాలనీ ప్రెసిడెంట్లు, కాలనీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.