by Suryaa Desk | Mon, Jan 13, 2025, 02:10 PM
పెద్దపల్లి జిల్లాలో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న డీసీఎంను (DCM) కారు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని గోదావరిఖని ఇందిరా గాంధీ చౌరస్తా వంక బెండు వద్ద ఆగి ఉన్న వ్యానును ఢీ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.