by Suryaa Desk | Mon, Jan 13, 2025, 01:43 PM
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పైన నిన్న కరీంనగర్ లో చేసిన అనుచిత వాక్యలు, అనుచిత ప్రవర్తనకు నిరసనగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభిమానులు జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం గాడిదపై పాడి కౌశిక్ రెడ్డి చిత్ర పటాన్ని ఊరేగించి నిరసన వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేసి, కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను ఖండించారు