by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:31 PM
పెద్దపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో ఆదివారం రోజున పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో, ముందస్తు సంకాంత్రి వేడుకలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, స్థానిక నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని బోగి మంటలను వెలిగించి ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళా సోదరీమణులకు బహుమతులను ప్రదానం చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.
అనంతరం ఎమ్మెల్యే విజయరమణ రావు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముందస్తుగా బోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు, సింగల్ విండో చైర్మన్లు, మహిళలు, పట్టణ యువతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.