by Suryaa Desk | Sun, Jan 12, 2025, 08:19 PM
భాగ్యనగరంలో స్థిరపడిన ఎంతో మంది సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్తుంటారు. దీంతో బస్సులు, ట్రైన్లు, విమానాలు, సొంత వాహనాలు.. ఇలా రకరకాల మార్గాల్లో ఇళ్లకు వెళ్తుంటారు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుండి పల్లె బాట పట్టిన నగరవాసులు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది.యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజాలో వాహనాల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతున్నది.వారాంతపు సెలవులు కూడా కలిసి రావడంతో శనివారం నుంచే రద్దీ పెరిగింది. ఆదివారం సైతం ఈ రద్దీ కొనసాగుతోంది.