by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:48 PM
AICC ( ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ) & TPCC ఆదేశానుసారం ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఆల్కలాంబ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీత రావు నాయకత్వంలో మహిళా కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు లో భాగంగా మహిళా కాంగ్రెస్ పార్టీలో విశేష సేవలకు గాను ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా నల్లగొండకు చెందిన శ్రీమతి దుబ్బ రూపా అశోక్ సుందర్ ని నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు నేడు హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికకు సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.