by Suryaa Desk | Sun, Jan 12, 2025, 08:25 PM
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై అనుచిత ప్రవర్తనకు నిరసనగా ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తా వద్ద పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహానం చేశారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పై వ్యక్తి గతంగా ఆరోపణలు చేయటంపై కౌశిక్ రెడ్డిని చట్ట పరంగా శిక్షించాలని పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.