by Suryaa Desk | Sun, Jan 12, 2025, 08:43 PM
ఖమ్మం జిల్లాలో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నట్లు తన క్యాంపు కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా కూసుమంచి క్యాంప్ ఆఫీసులో భోగి వేడుకల్లో పాల్గొంటారని అన్నారు. అనంతరం కూసుమంచి తహశీల్దార్ కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షిస్తారని తెలిపారు. మంచుకొండల్లో లిఫ్ట్ ఇరిగేషన్ కు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.