by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:32 PM
స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలో జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పన మహనీయుడు స్వామి వివేకానందుడన్నారు. ప్రపంచ దేశాలను తన ప్రసంగాలతో ఆలోచింప చేసిన స్వామి వివేకానందున్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.