by Suryaa Desk | Sun, Jan 12, 2025, 08:41 PM
కార్పొరేటర్ పాఠశాలలో తెలుగును పాఠ్యాంశంగా బోధన ఉండాలని మాజీ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్‌లో ఉన్న శాంటినోస్ గ్లోబల్ స్కూల్ 8వ వార్సికోత్సవ వేడుకలకు ఆమె హాజరయ్యారు. విద్యార్థులకు ఆమె చేతుల మీదగా బహుతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేసిందన్నారు.బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విద్యకు ఎంతో ప్రధాన్యత ఇచ్చే వారని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడానికి కోట్ల నిధులు కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అర్కల భూపాల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు దీప్‌లాల్ చౌహన్, అర్కల కామేష్ రెడ్డి, సిల్వేరు సాంబ శివ, మహిళా అధ్యక్షురాలు జలాల్పూర్ సునిత బాల్ రాజ్, ప్రభాకర్ రెడ్డి, నర్సిరెడ్డి, పాఠశాల యజమాన్యం, అధ్యాపాకులు తదితరులు ఉన్నారు.