by Suryaa Desk | Fri, Jan 17, 2025, 10:30 AM
హైదరాబాద్ పట్టణంలోని షేక్‌పేటలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఫిలింనగర్ పరిధిలోని ఓ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఉన్న జుహి ఫెర్టిలిటీ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న ఆకాశ్ స్టడీ సెంటర్‌లో మంటలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.