by Suryaa Desk | Wed, Jan 15, 2025, 05:53 PM
నిర్మల్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. గాలిపటాల ఎగురవేత ఓ బాలుడి ప్రాణాలు తీసింది. గుల్జార్ మార్కెట్ ప్రాంతంలో గాలిపటాలను ఎగురవేస్తూ ఉబేజ్(14) అనే బాలుడు ప్రమాదవశాత్తు ఇంటి పైనుంచి కిందపడ్డాడు.
దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. కాగా, చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఉబేజ్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.