by Suryaa Desk | Wed, Jan 15, 2025, 06:20 PM
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీ రాముల పల్లె గ్రామంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించారు.ఇందులో ఐదు టీములు పాల్గొన్నాయి.టాస్ వేసి ప్రారంభించిన నిర్వాహకుడు రామ్ చందర్ రెడ్డి మొదటి బహుమతి 5000 రూపాయలు,రెండవ బహుమతి మూడువేల రూపాయలు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కిష్టంపేట రమేష్ రెడ్డి,పొన్నం రఘుపతి గౌడ్,నల్ల నరసింహారెడ్డి,రైతు సంఘం అధ్యక్షుడు గుండేటి తిరుపతి రెడ్డి గ్రామానికి చెందిన యువకులు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ప్రతి సంవత్సరం యువకులు అడిగిన వెంటనే కాదు అనకుండా ఆటల పోటీలు నిర్వహిస్తున్న రామచంద్ర రెడ్డికి శ్రీరాములపల్లి గ్రామ యువకులు కృతజ్ఞతలు తెలియజేశారు.యువకులకు ఎప్పుడు మంచి ప్రోత్సాహం ఇస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు.