by Suryaa Desk | Tue, Jan 14, 2025, 10:43 AM
పతంగులు ఎగురవేసే వారు చైనా మాంజాను ఉపయోగిస్తే గుర్తించి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారో తెలుసుకుని చర్యలు తీసుకోవాలని సోమవారం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె. వెంకటేశ్వరరెడ్డి సూచించారు. సిబ్బంది ఎక్కడైనా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. చైనా మాంజాపై అప్రమత్తంగా ఉండాలని, ఇది చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు.