by Suryaa Desk | Wed, Jan 15, 2025, 06:24 PM
కోహెడ మండల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలను ప్రజలందరూ సోమ, మంగళవారాల్లో సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు. వాకిళ్లలో మహిళలు రంగు రంగు ముగ్గులతో అందంగా అలకరించి గొబ్బెమ్మలు పెట్టారు. తెలుగింటి సాంప్రదాయాన్ని చాటారు. ఉదయం నుంచే దేవాలయాలు భక్తజన సందోహంతో కిటకి టలాడాయి. నూతన వస్త్రాలు ధరించి పిల్లలంతా సంబరాలలో మునిపోయారు. పిల్లలు, పెద్దలు గాలిపటాలను ఎగురవేస్తూ సందడి చేశారు. రసకసి ఆటలతో గ్రామాలలో ఉచ్ఛంగా సందడి వాతావరణం కనిపించింది గెలిచిన వాళ్లకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
ఆటలు ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. పిండి వంటలు తయారు చేసుకొని ఆనందంగా గడిపారు. ప్రతినిత్యం రకరకాల పనులలో ఉండి ఎక్కడో ఒక్క చోట పనిచేసే వారంతా బంధుమిత్రులతో స్వగ్రా మానికి చేరుకొని అన్ని సమస్యలు మరిచిపోయి రోజంతా హాయిగా, ఆనందోత్సవాల మధ్య పండుగులన జరుపుకున్నారు. ఎన్నో రోజులుగా ఉద్యోగ పను లలో నిమగ్నమై ఉండి.. స్వంత ఊరికి చేరుకున్న స్నేహితులతో ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో తెలుగింటి సాంప్రదాయా నిదర్శనంగా నిలిచిందని ఆనందం వ్యక్తం .