by Suryaa Desk | Thu, Jan 16, 2025, 02:29 PM
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై(Guvvala Balaraju) కేసు నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని భ్రమరాంబ ఆలయం వద్ద నిన్న(గురువారం) రాత్రి పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని మాజీ ఎమ్మెల్యే బాలరాజుపై ఎస్ఐ రమేశ్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు గువ్వల బాలరాజు, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ ఆలయంలో ఉన్నాడని, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆలయంలోకి అనుమతించలేదుదీంతో గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ నేతలు అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు, గువ్వల బాలరాజు అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆలయం ఎదుటే బైఠాయించి వారు నిరసన తెలిపారు. అయితే నన్ను కావాలనే పోలీసులు ఆలయంలోకి వెళ్లకుండా ఆపారని గువ్వల మండిపడ్డారు. ఇన్‌స్పెక్టర్ రవీందర్ అనే వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ కృష్ణతో కుమ్మక్కై నన్ను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని బాలరాజు ఆరోపించారు. న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసు స్వీకరించించి తనకు న్యాయం చేయాలని కోరిన విషయం తెలిసిందే.