by Suryaa Desk | Thu, Jan 16, 2025, 10:50 AM
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగకు సొంతూరికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు లారీ రూపంలో వచ్చి కబలించింది.వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారి భువనగిరి మున్సిపాలిటీ రాయగిరి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఘటనలో మహిళతో పాటు చిన్నారి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.స్థానికులు చెబుతున్నదాని ప్రకారం.. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి వచ్చి ఢీకొందంటున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన వారిగా చెబుతున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు ప్రమాదంపై సమాచారం అందించారు. ఘటనపై స్పందించిన పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. క్షతగాత్రులను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.అయితే.. పెట్రోల్ పంపులోకి వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాద సంభవించిందని స్థానికులు తెలిపారు. కారు పూర్తిగా లారీకి వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. జేసీబీ సహాయంతో కారణం బయటికి తీసే ప్రయత్నం చేశారు పోలీసులు. పండక్కి వచ్చి వెళ్తుండగా ఈ ఘటన జరగడంతో కేసముద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీశారు. ఎవరి నిర్లక్ష్యం కారణంగా జరిగిందో తెలుసుకునేపనిలో పడ్డారు.