by Suryaa Desk | Wed, Jan 15, 2025, 07:01 PM
కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో యాదేచ్చగా ప్రతిరోజు రాత్రినక పగలనక ఇసుక, మట్టి (మొరం )జోరుగా అక్రమ రవాణా సాగుతున్నది.ప్రభుత్వ అనుమతులు లేకుండా దళారులు అక్రమంగా ఇసుక తవ్వి, ప్రాణహిత చేవెళ్ల కాలువ మట్టి, (మొరం)తీసుకోకెళ్ళి సొమ్ము చేసుకుని లబ్ది పొందుతున్న, అధికారులు చూసి చూడనట్టు వ్యవహారిస్తున్నారు.ప్రభుత్వ ఖజానా కు నష్టం కలిగిస్తున్నారు.దీనికి కొందరు రాజకీయ నాయకులు అండగా ఉండి లక్షల రుపాయలు సంపాదించుకున్నట్లు ప్రజలు చర్చించుకుంటూనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్, సిర్పూర్, తాడేపల్లి కౌటాల, చింతల మానేపల్లి, దహెగాం, బెజ్జుర్, ఆయా మండలాల వాగులనుండిట్రాక్టర్లతో, లారీ లతో యాదేచ్చగా అక్రమ రవాణా సాగుతున్న మైనింగ్, రెవిన్యూ, పోలీస్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహారిస్తూ, పిర్యాదులు, సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని, ప్రజలు సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకోకుండా అక్రమ దారులకు, దళారులకు కొమ్ముకాస్తూ ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అధికారులు జవాబుదారిగా పారందర్శకంగా విధులు నిర్వహిస్తే అక్రమ రవాణాను అరికట్టవచ్చునని ప్రజలు కోరుతున్నారు. అరికట్టని యెడల భూ గర్భ జలాల అడగంటి నీటి లభ్యత తగ్గిపోతుందని రైతులు ఆందోళన వైక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధితజిల్లా అధికారులు స్పందించి ఇసుక, మొరం మట్టి అక్రమ దారులపై అండగా ఉంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.