by Suryaa Desk | Fri, Jan 17, 2025, 12:40 PM
హుజూరాబాద్ బీఆర్‌ఎస్ MLA పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ విచారణకు హాజరయ్యారు. డిసెంబర్ 4న కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్ PSకు వెళ్లారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేయబోయారు. అయితే ఆ సమయంలో ఇన్స్‌పెక్టర్ రాఘవేందర్ బయటకు వెళ్తున్నారు. దీంతో సీఐ వాహనానికి తన వాహనాన్ని అడ్డు పెట్టి కౌశిక్ రెడ్డి హల్‌చల్ చేశారు. ఈ ఘటనపై సీఐ ఫిర్యాదు చేయగా కేసు నమోదు అవడంతో ఇవాళ ఉదయం మాసబ్ ట్యాంకు పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు.పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై కేసు నమోదు అయ్యింది. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు