by Suryaa Desk | Fri, Jan 17, 2025, 04:15 PM
శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం నగరంలోని ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మున్నూరు కాపు సంఘం సీనియర్ నాయకులు జీ. కృష్ణ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ శ్రీకృష్ణదేవరాయల సేవలను స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసీ జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాములు, నరాల నరేష్ మోహన్, తదితరులు ఉన్నారు.